Miheeka Bajaj And Rana Daggubati : వైరల్ గా మారిన రానా-మిహిక ఫస్ట్ పిక్!

Miheeka Bajaj And Rana Daggubati : మొన్నటివరకూ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో దగ్గుబాటి రానా తాజాగా

Krishna
Updated on: 10 Aug 2020 11:34 AM IST
Miheeka Bajaj And Rana Daggubati : వైరల్ గా మారిన రానా-మిహిక ఫస్ట్ పిక్!
X
Miheeka Bajaj And Rana Daggubati

Miheeka Bajaj And Rana Daggubati : మొన్నటివరకూ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో దగ్గుబాటి రానా తాజాగా ఓ ఇంటివాడు అయ్యాడు.. తన ప్రేయసి మిహికాను వేద మంత్రాల సాక్షిగా ఆమె మేడలో మూడు ముడులు వేసి ఏడు అడుగులు వేశాడు.. కోవిడ్ నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో అతికొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, సమంత మాత్రమే హాజరయ్యారు. ఇప్పటికే రానా- మహిక పెళ్ళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా రానా స‌తీమ‌ణి మిహికి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు మాది కుటుంబం అంటూ కామెంట్ పెట్టింది మిహిక .. ఈ పిక్ రానా, మిహిక నవ్వుతూ ఫోజిచ్చారు. వీరితో పాటుగా ఈ ఫోటోలో వారి పెంపుడు కుక్క కనిపిస్తుంది. మిహికా ఊదా రంగు లెహంగాపై బంగారు ఎంబ్రాయిడీతో కూడిన డ్రెస్ ధ‌రించ‌గా, రానా బూడిద రంగు కుర్తాలో కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



ఇక ఇది ఇలా ఉంటే .. పెళ్లిలో మిహిక వెసుకున్న డ్రెస్ ఖర్చు అక్షరాల ₹6 లక్షలని తెలుస్తోంది. దీనిని డిజైన్ చేయడానికి వందల గంటల శ్రమే ఉందని తెలుస్తోంది. ఇక హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్‌ కు ధర దాదాపుగా ₹2 లక్షల వరకు ఉంటుందని సమాచారం.. ఇక ఈ పెళ్ళికి హాజరైనా హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ₹1.59 లక్షలు అని సమాచారం.

ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి గతఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఆకట్టుకున్న రానా, ప్రస్తుతం అరణ్య ,విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో అరణ్య విడుదలకి సిద్దంగా ఉండగా, విరాటపర్వం షూటింగ్ చివరిదశలో ఉంది.

Krishna

Krishna

Next Story