రవితేజ భార్య పాత్రలో చేసి ఇప్పుడు వదినగా మారిన హీరోయిన్

Ravi Teja: హీరోయిన్ గా రవి తేజ తో రొమాన్స్ చేసి ఇప్పుడు వదిన పాత్ర చేస్తున్న నటి

Jyothi
Updated on: 2 Jan 2023 12:13 PM IST
The Heroine Played the Role of Ravi Teja Wife and Now Became Vadina
X

రవితేజ భార్య పాత్రలో చేసి ఇప్పుడు వదిన గా మారిన హీరోయిన్

Ravi Teja: ఒక సమయంలో శృతిహాసన్ కరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది ఈ భామ. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు బాలకృష్ణ "వీరసింహారెడ్డి" సినిమాలలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ సరసన "సలార్" సినిమాలో కూడా బిజీగా ఉన్న శృతిహాసన్ సీనియర్ హీరోలు అందరికీ అభిమాన హీరోయిన్ గా మారిపోయింది.

అయితే గతంలో ఈమె హీరోయిన్ గా నటించిన ఒక హీరోకి ఇప్పుడు శృతిహాసన్ వదిన పాత్రలో కనిపించబోతోంది. ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. "బలుపు" మరియు "క్రాక్" సినిమాలలో శృతిహాసన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. "క్రాక్" సినిమాలో రవితేజ భార్య పాత్రలో కనిపించింది శృతిహాసన్. అయితే ఇప్పుడు చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి రవితేజ అన్నయ్య పాత్ర లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ ఇప్పుడు రవితేజ కి వదిన పాత్ర చేసినట్టే. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాక హీరోయిన్లు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారు. కానీ శృతిహాసన్ కెరీర్ పీక్ లో లో ఉన్నప్పుడే ఇలా వదిన పాత్ర చేయడం అభిమానులకు కూడా షాక్ ఇస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ కి జోడిగా కేథ‌రిన్ థ్రెసా నటించింది. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఈ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13 న విడుదల కాబోతోంది.

Jyothi

Jyothi

Next Story