భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న "సీతారామం" హీరోయిన్

*నాని సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్

Jyothi
Published on: 3 Jan 2023 8:31 AM IST
The Heroine of Sita Ramam is Demanding Huge Remuneration
X

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న "సీతారామం" హీరోయిన్ 

Mrunal Thakur: హిందీ టీవీ సీరియల్స్ తో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్యనే "సీతారామం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ మృణాల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా విడుదలైన ఈ సినిమా ఒక క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రలో మృణాల్ అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఇంకా రెండవ సినిమా సైన్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంది. దీనికి కారణం రెమ్యూనరేషన్ అని కొందరు చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న #నాని30 సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నిర్మాతలు ఆమెకు ఏకంగా కోటి రూపాయలు కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. "సీతారామం" సినిమాకి 85 లక్షలు తీసుకున్న మృణాల్ ఠాకూర్ నాని సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

మృణాల్ కి ఉన్న క్రేజ్ వల్ల నిర్మాతలు కూడా ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీంతో వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ భామ. అయితే మరో వైపు మాత్రం ఆమె సినిమా కథ నచ్చడం వల్ల మాత్రమే సినిమాని ఒప్పుకున్నారని రెమ్యూనరేషన్ వల్ల కాదని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా "సీతారామం" తో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ రెండవ సినిమా తో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Jyothi

Jyothi

Next Story