Godfather: హైదరాబాదులో గాడ్ ఫాదర్ సైలెన్స్

Godfather: రెండు ప్రమోషనల్ ఈవెంట్ లతో బిజీ కాబోతున్న "గాడ్ ఫాదర్" బృందం

Jyothi
Updated on: 8 Sept 2022 2:31 PM IST
The Godfather Team is Going to be Busy With two Promotional Events
X

Godfather: హైదరాబాదులో గాడ్ ఫాదర్ సైలెన్స్ 

Godfather: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. నిజానికి ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు కొంచెం తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా "గాడ్ ఫాదర్" సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.

"గాడ్ ఫాదర్" సినిమా అనుకున్నట్టుగానే అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకనిర్మాతలు అనంతపురంలో ఒక ఫంక్షన్ మరియు ముంబైలో మరొక ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. కానీ హైదరాబాదులో మాత్రం సినిమాకి సంబంధించిన ఎటువంటి ఈవెంట్ జరగకపోవడం అభిమానులను కొంచెం నిరుత్సాహపరుస్తుంది. నయనతార మరియు సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

Jyothi

Jyothi

Next Story