ఒకప్పటి హీరో ఇప్పుడు కళ్యాణ్ రామ్ డైరెక్టర్

Tollywood: "బింబిసార" డైరెక్టర్ ఒక హీరోనా?

Jyothi
Published on: 4 Aug 2022 10:52 AM IST
The Former Hero is now the Director of Kalyan Ram
X

ఒకప్పటి హీరో ఇప్పుడు కళ్యాణ్ రామ్ డైరెక్టర్ 

Tollywood: మంచు హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ఇప్పుడు "బింబిసార" అనే ఒక సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. హారర్, థ్రిల్లర్ మరియు యాక్షన్ జోనర్లలో ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. కేథ‌రిన్ థ్రెసా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సంయుక్తా మీనన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇంతకు ఈ వశిష్ఠ్ ఎవరు వెతకగా ఈయన గతంలో ఒక హీరో అనే విషయం వెలుగులోకి వచ్చింది. "ప్రేమలేఖ రాశా" అనే సినిమాతో కులశేఖర్ దర్శకత్వంలో మల్లిడి వేణు అనే పేరుతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకు కావడంతో వేణు కి హీరోగా ఎంట్రీ సులభంగానే లభించింది కాని హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. ఇక దర్శకత్వంపై ఆసక్తి ఉండడంతో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి సొంతం గా కథలు రాసుకున్నారు. ఐదేళ్ల క్రితమే డైరెక్టర్ అవ్వాల్సింది. కానీ పలు కారణాల వల్ల అది జరగలేదు. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ తో కలిసి "బింబిసార" సినిమా తో డైరెక్టర్ గా మారారు.

Jyothi

Jyothi

Next Story