Top
logo

Fast and Furious: ముగింపుకు దశకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్

Fast and Furious: ముగింపుకు దశకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్
X

Fast and Furious: ముగింపుకు దశకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్

Highlights

Fast and Furious: 20 ఏళ్లుగా ఆడియన్స్‌ ను అలరిస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ కూడా ముగింపుకు వచ్చేసింది` అంటున్నారు మేకర్స్

Fast and Furious: ఎంత గొప్ప ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే.. సో… ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ కూడా ముగింపుకు వచ్చేసింది` అంటూ ఎమోషనల్ మెసేజ్‌ ఇచ్చారు మేకర్స్‌. కష్టంగానే ఉన్నా ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న 10th, 11th పార్ట్స్ రిలీజ్ కావడానికి మరో మూడేళ్లు పడుతుంది. సో మూడేళ్లలో ఈ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌కు తెరపడనుందన్న మాట.

ఇది యాక్షన్‌ మూవీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్‌.. 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు శుభం కార్డ్ పడనుంది. యస్‌… 2001 నుంచి వెండితెర మీద స్పీడు చూపిస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సీరిస్‌కు మరో రెండు ఇన్‌స్టాల్మెంట్‌ల తరువాత సెండాఫ్‌ ఇచ్చేయబోతున్నారట మేకర్స్‌. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత మరో రెండు సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్‌ మెంట్ ఆల్రెడీ వచ్చేసింది. అయితే ఈ సిరీస్‌లో ఆ రెండు సినిమాలే ఫైనల్ అంటూ ప్రకటించారు హీరో విన్ డిజిల్‌. యూనిట్ నిర్ణయంతో మూవీ లవర్స్‌ ఫీల్ అవుతున్నారు.

Web TitleThe Fast and Furious saga will end in 2024 after 11 movies | Fast and Furious List
Next Story