Family Man 2: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

Family Man Season 2 Trailer Release Date: టాలీవుడ్ అగ్రకథానాయక సమంత తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది.

Samba Siva Rao
Updated on: 18 Jan 2021 6:02 PM IST
Family Man 2: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
X

Family Man Season 2 Release Date: టాలీవుడ్ అగ్రకథానాయక సమంత తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఇటీవలే సమంత హౌస్ట్ గా.. ఆహా ఫ్లాట్ ఫార్మ్ పై వస్తున్న సామ్ జామ్ మంచి సక్సెస్స్ ఫుల్ ముగిసింది. తాజాగా హిందీలో విజయవంతమైన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు సిక్వెల్ గా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' రానుంది. అయితే ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే రిలీజ్ కానుంది. ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు సామ్ వెల్లడించింది. ఫిబ్రవరి 12నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ అలరించనుంది.

ఇందులో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. థ్రిల్లర్‌ కాన్సెప్టుతో వస్తున్న ఈ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషించింది. సంక్రాంతి సందర్భంగా 'ది ఫ్యామిలీ మేన్‌ 2' టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చివర్లో సమంత లుక్‌ను రివీల్‌ చేశారు. సమంత లుక్‌ చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. దర్శకులు రాజ్‌, డీకే తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌'. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 మంచి ఆదరణను దక్కించుకుంది. సమంత పాత్ర ఎలా ఉంటుందోనని అందరి ఆసక్తి నెలకొంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story