The Family Man 2 Trailer: 'వాళ్లందరినీ చంపేస్తా' అంటోన్న సమంతా..!

The Family Man 2: ఎట్టకేలకు సమంతా తొలిసారి నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది.

Venkata Chari
Published on: 19 May 2021 11:34 AM IST
The Family Man Season 2 Trailer Out and Release on 04th June 2021
X

సమంతా (ఫొటో యూట్యూబ్)

The Family Man 2 Trailer: ఎట్టకేలకు అక్కినేని సమంతా తొలిసారి నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ లో సమంతా ఐసిస్ లో సభ్యురాలిగా, సూసైడ్‌ బాంబర్‌గా ఈ ట్రైలర్‌లో కనిపించింది. కనిపించనుంది. అలాగే డీ గ్లామరస్‌ గా కనిపించిన సమంతా... వాళ్లందరినీ నేను చంపుతా అనే డైలాగులతో ఆకట్టుకుంది. సామ్ కళ్లలో ఫైర్‌, యాక్టింగ్‌ ను చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ లో ఇరగదీసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ జూన్ 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

శ్రీకాంత్‌(మనోజ్‌ భాజ్‌పాయ్‌).. జాతీయ దర్యాప్తు సంస్థకు రహస్యంగా పనిచేస్తుంటాడు. అతని భార్యగా ప్రియమణి నటించింది. అటు ఉద్యోగంలోని ఒత్తిడి, ఇటు ఫ్యామిలీలో ఒడిదొడుకులను మ్యానేజ్ చేయలేక సతమవుతుంటాడు శ్రీకాంత్. ఈ క్రమంలో ఆయన పై వచ్చే సన్నివేశాలు నవ్వులను పూయిస్తాయి. మరోవైపు ఉగ్రవాదులను ఏరిపారేయడంలో శ్రీకాంత్‌ అద్భుతంగా నటించాడు.

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఎప్పుడెపుడు వస్తుందోనని ఎదురుచూసిన సమంతా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' విడుదల కావడంతో... ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story