The Family Man 3: మూడో భాగం మొదలయ్యేది అక్కడి నుంచేనా?

The Family Man 3: ఎన్నో అంచనాలతో శుక్రవారం విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

Venkata Chari
Published on: 5 Jun 2021 9:46 PM IST
The Family Man 3 Enemies From China
X

ది ఫ్యామిలీ మ్యాన్ 2

The Family Man 3: ఎన్నో అంచనాలతో శుక్రవారం విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మొదటి సిరీస్‌కు దీటుగా రాజ్‌, డీకే తాజా సిరీస్‌ను తీర్చిదిద్దారు. శ్రీకాంత్‌ తివారిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ మరోసారి ఆకట్టుకోగా, రాజీ అలియాస్‌ రాజ్యలక్ష్మిగా అక్కినేని సమంత తన పాత్రలో జీవించింది.

తొలి ఎపిసోడ్‌ నుంచి చివరి వరకూ ఉత్కంఠమైన కథనంతో తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతోంది. సమంతా పాత్రతోపాటు, సిరీస్‌ అద్భుతంగా ఉందంటూ‎ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌తో 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3' పై ఆలోచించేలా చేశారు మేకర్స్. అయితే, మొదటి భాగం పాకిస్థాన్ ఉగ్రవాదంతో ఆకట్టుకోగా, రెండో భాగంలో తమిళ రెబల్స్‌, శ్రీలంక నేపథ్యంలో తీర్చిదిద్దారు.

కాగా, మూడో భాగం చైనా నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ దేశం నుంచి వచ్చే ముప్పును శ్రీకాంత్‌ తివారీ అండ్‌ టీమ్‌ ఎలా నిర్విర్యం చేశారో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కరోనా కష్టకాలంలో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో దాడి చేసేందుకు చైనా కుట్ర పన్నుతుంది. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తితో చాట్‌ చేస్తుంటాడు. ''ప్రాజెక్ట్‌ గువాన్‌ యు ను ముందుకు తీసుకెళ్దామా సర్‌'' అని ఇవతలి వ్యక్తి అడుగుతాడు. ఈమేరకు 'ప్రాజెక్టు గువాన్‌ యు' ముందుకు వెళ్లండి సోల్జర్‌' అని రిప్లై వస్తుంది. మరి సీజన్‌-3లో చైనీస్‌ ట్రూప్స్‌తో టాస్క్‌ ఎలాంటి పోరాటం చేస్తుందో చూడాలి. ఇక రెండో భాగంలో సమంతా కీలక పాత్ర పోషించగా, మరి మూడో భాగంలో ఎవరిని తీసుకోనున్నారో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story