"ఖైదీ 2" కోసం విలన్ గా మారనున్న డైరెక్టర్

* "ఖైదీ 2" సినిమాలో ఒక పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

R Tripura Malini
Published on: 24 Nov 2022 7:50 AM IST
The director will turn villain for khaidi sequel
X

"ఖైదీ 2" కోసం విలన్ గా మారనున్న డైరెక్టర్

Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన సినిమా "ఖైదీ". తమిళంలో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్యనే కమల్ హాసన్ హీరోగా విడుదలైన "విక్రమ్" సినిమాతో లోకేష్ కనగరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించారు. తాజాగా ఇందులో మొదటి సినిమా ఆయన "ఖైదీ" కి ఇప్పుడు సీక్వెల్ త్వరలో తెరకెక్కనుంది. "ఖైదీ" సినిమా క్లైమాక్స్ లో కూడా సినిమాకి ఒక సీక్వెల్ ఉంటుంది అని హింట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. అయితే సూపర్ హిట్ అయిన "విక్రమ్" సినిమాలో "ఖైదీ" సినిమా తాలూకు ఇన్పుట్ లను పాత్రలను కూడా తీసుకువచ్చిన లోకేష్ కనగరాజ్ ఖైదీ సీక్వెల్లో రోలెక్స్ టీం నుంచి ఒక వ్యక్తిని విలన్ గా చూపించబోతున్నారట.

ఇక రోలెక్స్ టీం నుంచి "ఖైదీ 2" లో విలన్ గా నటించబోతున్న నటుడు మరెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాఘవ లారెన్స్. "ఖైదీ" లో కార్తీ కి వ్యతిరేకంగా విలన్ పాత్రలో రాఘవ లారెన్స్ కనిపించబోతున్నారు అని తమిళ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, హీరోగా, దర్శకుడిగా, మరియు నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో ఒక తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ "ఖైదీ 2" సినిమాలో ఒక పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఒకవైపు "చంద్రముఖి 2" సినిమాలో కూడా నటిస్తున్న రాఘవ లారెన్స్ మరోవైపు "ఖైదీ 2" సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story