Horror Film: సీన్ సీన్‌కో ట్విస్ట్.. సినిమా మొత్తం భయంకరమే.. ఒంటరిగా చూస్తే హడలెత్తాల్సిందే భయ్యో..

Scary Movies Netflix: హారర్ చిత్రాలను బాగా ఇష్టపడుతుంటారా? అయితే, మీకోసం ఓ సినిమాను తీసుకొచ్చాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 12 Oct 2024 10:31 AM IST
The Curse of La Llorona Best Horror Film on Netflix
X

Horror Film: సీన్ సీన్‌కో ట్విస్ట్.. సినిమా మొత్తం భయంకరమే.. ఒంటరిగా చూస్తే హడలెత్తాల్సిందే భయ్యో..

Scary Movies Netflix: హారర్ చిత్రాలను బాగా ఇష్టపడుతుంటారా? అయితే, మీకోసం ఓ సినిమాను తీసుకొచ్చాం. ఈ అత్యంత భయానక సినిమాను చూస్తే.. మీరు కచ్చితంగా భయపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని OTTలో చూడొచ్చు. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమా కేవలం 93 ​​నిమిషాల నిడివిగలది. 2019లో విడుదలై భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా పేరు 'ది కర్స్ ఆఫ్ లా లోరోనా'. ఇది మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించిన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం. ఈ అతీంద్రియ చిత్రానికి మిక్కీ డాట్రీ, టోబియాస్ ఐకోనిస్ కథ అందించారు. ఈ సినిమా అమెరికన్ జానపద కథల ఆధారంగా రూపొందించారు.

'ది కర్స్ ఆఫ్ లా లోరోనా' 15 మార్చి 2019న విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 123 మిలియన్ డాలర్లు సంపాదించింది. సినిమా ఎంత భయానకంగా ఉంటుందో సినిమా పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది.

'ది కర్స్ ఆఫ్ లా లోరోనా' తారాగణం గురించి మాట్లాడితే, ఇందులో లిండా కార్డెల్లిని, ఐరీన్ కాంగ్, క్రిస్ గార్సియా, రేమండ్ క్రజ్, సీన్ పాట్రిక్ థామస్, టోనీ అమెండోలా వంటి తారలు ఉన్నారు.

'ది కర్స్ ఆఫ్ లా లోరోనా' కథ గురించి మాట్లాడితే, ప్యాట్రిసియా తన కుమారుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది. ఇది తెలుసుకున్న ప్రభుత్వ అధికారి అన్నా.. ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది. అయితే, అన్నా పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు కథలో ట్విస్ట్ వస్తుంది. కుటుంబాన్ని వెంటాడే ఆత్మ గురించి తెలుస్తోంది. ఈ క్రమంలో చివరికి మంత్రగత్తె పిల్లలను అపహరిస్తుంది. దీంతో షాకైన అన్నా.. ఈ ఆపద నుంచి ఎలా బయటపడిందో సినిమాలో చూడొచ్చు.

'ది కర్స్ ఆఫ్ లా లోరోనా' సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. 1 గంట 33 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని మీరు ఇంట్లో కూర్చొని హాయిగా ఆస్వాదించవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story