Pawan Kalyan: సోషల్ మీడియాలో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ల ఫాలోయింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్లకు కూడా పెరిగిపోతున్న క్రేజ్..

Jyothi
Published on: 22 April 2023 12:33 PM IST
The Craze Increasing for the Heroines Acted Opposite Pawan Kalyan
X

Pawan Kalyan: సోషల్ మీడియాలో పెరుగుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ల ఫాలోయింగ్ 

Pawan Kalyan: మామూలుగా అయితే ఏదైనా సినిమా హిట్ అయినా లేక బ్లాక్ బస్టర్ అయినా ఆ సినిమాలో నటించిన హీరో మరియు హీరోయిన్లకి సోషల్ మీడియాలో కూడా ఫాన్ ఫాలోయింగ్ కొంత పెరుగుతుంది. కానీ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిన వారి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బీభత్సంగా పెరుగుతుంది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ఓజీ" సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైన సంగతి తెలిసిందే.

ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా "గ్యాంగ్ లీడర్" సినిమాలో నటించిన ప్రియాంక అరుల్ మోహాన్ ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయినట్లు సమాచారం. "ఓజీ" సినిమాకి సంబంధించిన ప్రతి పోస్ట్ లో తన పేరు కూడా కనిపిస్తోంది.

"గ్యాంగ్ లీడర్" మరియు "శ్రీకారం" సినిమాలు విడుదలయ్యాక వచ్చిన ఫేమ్ కంటే "ఓజీ" సినిమా విడుదల కాకముందే ప్రియాంక క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే చాలా వరకు హీరోయిన్లు పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి కలలు కంటారు. కెరీర్ మొదట్లోనే ప్రియాంక అరుల్ మోహన్ ఈ గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసింది. తన కెరీర్లో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story