Akhil: సినిమా సినిమాకి తగ్గిపోతున్న అఖిల్ పై ఉన్న క్రేజ్

The Craze for Akhil is Diminishing from film to film
x

Akhil: సినిమా సినిమాకి తగ్గిపోతున్న అఖిల్ పై ఉన్న క్రేజ్

Highlights

Akhil: తన కెరీర్ ను తన చేతులతో నాశనం చేసుకుంటున్నా అక్కినేని హీరో

Akhil: అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికీ ఐదు సినిమాలలో నటించారు కానీ ఒక్క సినిమాతో కూడా మంచి బ్లాక్ బస్టర్ ని అందుకోలేక పోయారు. అక్కినేని నాగార్జున తనయుడిగా అక్కినేని అఖిల్ "సిసింద్రీ" అనే సినిమాతో మొట్టమొదటిసారిగా వెండితెరపై కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి అఖిల్ ఎప్పుడెప్పుడు హీరోగా మారతాడా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. 2014 లో "మనం" సినిమాలో క్లైమాక్స్ లో క్యామియో పాత్రలో కనిపించిన అఖిల్ కి అప్పటినుంచి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే 2015లో అఖిల్ మొట్టమొదటిసారిగా హీరోగా "అఖిల్" అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలైన మొదటి రోజు కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు నైజాం ఏరియాల లోనే 8 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది ఈ సినిమా. దాదాపు స్టార్ హీరో రేంజ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు అఖిల్ మొదటి సినిమా ఓపెనింగ్ డే రోజే అందుకున్నారు. అప్పట్లో అఖిల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద మర్చిపోలేని డిజాస్టర్ గా నిలిచింది.

ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన హలో మరియు మిస్టర్ మజ్ను సినిమాలకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. అఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ ఏమాత్రం బాగోలేదని అభిమానులు సైతం కామెంట్లు చేశారు. ఇక ఈ మధ్యనే ఏప్రిల్ 28న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన "ఏజెంట్" సినిమా మొదటి రోజు కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా కలిపినా కూడా ఐదు కోట్ల కంటే తక్కవే ఉన్నాయి. కేవలం స్క్రిప్ట్ సెలక్షన్లో తన అజాగ్రత్త కారణంగానే అఖిల్ తన కెరియర్ ని తానే నాశనం చేసుకుంటున్నాడు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories