Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్

Jani Master: ఇవాళ కస్టడీకి తీసుకోనున్న పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Sept 2024 1:31 PM IST
The court gave a crucial judgment on Jani Master custody petition
X

Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చిన కోర్ట్

Jani Master: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీకి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి కోర్టు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు.

లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ఈనెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.

Also Read: Jani Master: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో 10 ముఖ్యాంశాలు

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story