Bigg Boss: రోజురోజుకు ముదురుతున్న బిగ్‌బాగ్‌ షో వివాదం

Bigg Boss: బిగ్‌బాస్‌ నిర్వాహకులపై హైకోర్టుకు లేఖరాశా

Shekhar G
Published on: 20 Dec 2023 3:18 PM IST
The Controversy Of Bigg Boss Show Is Getting Serious Day By Day
X

Bigg Boss: రోజురోజుకు ముదురుతున్న బిగ్‌బాగ్‌ షో వివాదం

Bigg Boss: బిగ్ బాస్ షో వివాదం ముదురుతోంది. తాజాగా ఈ రియాల్టీ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చెయ్యాలంటూ.. HRCకి హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగం అంతా ఇంతా కాదన్నారు. ప్రైవేట్ వాహనాలపై దాడులు చేయడం మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం చేశారు. జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే నాగార్జునపై కేసు నమోదు చెయ్యాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయవాది అరుణ్. బిగ్ బాస్ నిర్వాహకులు సైతం నిర్లక్ష్యంగా వహించారని.. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశానంటున్న న్యాయవాది అరుణ్‌.

Shekhar G

Shekhar G

Next Story