Allu Arjun: పుష్ప 2 లో ఇదే అతి పెద్ద ట్విస్ట్ అట.. అల్లు అర్జున్ కి వెన్నుపోటు పొడవబోతున్న..

* అల్లు అర్జున్ కి వెన్నుపోటు పొడవబోతున్న జూనియర్ ఆర్టిస్ట్..

Dhatripriya
Published on: 8 Feb 2023 11:15 AM IST
The Biggest Twist In Pushpa 2
X

పుష్ప 2 లో ఇదే అతి పెద్ద ట్విస్ట్ అట..

Pushpa The Rise: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం "పుష్ప: ది రూల్" అనే టైటిల్తో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా "పుష్ప: ది రూల్" సినిమా కథ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

"పుష్ప 2" లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట. "పుష్ప 1" లో అల్లు అర్జున్ పక్కనే ఉండే కేశవ పాత్ర గురించి తెలియని వారు ఉండరు. జగదీష్ ప్రతాప్ ఈ పాత్రను పోషించారు. అయితే తాజా సమాచారం ప్రకారం "పుష్ప 2" సినిమాలో కేశవ పాత్ర పుష్ప రాజ్ కి వ్యతిరేకంగా మారుస్తుందట. ఫాహద్ ఫాసిల్ పాత్ర కంటే కేశవ పాత్ర ఈ సినిమా కథకి చాలా కీలకం కాబోతోందని, కేశవ పుష్ప రాజ్ కు వెన్నుపోటు పొడుస్తాడని అది సినిమాకి అతిపెద్ద ట్విస్ట్ అని సమాచారం.

నిజానికి డైరెక్టర్ సుకుమార్ దీనికి సంబంధించిన హింట్ పార్ట్ వన్ లోనే ఇచ్చారని, అందుకే "పుష్ప: ది రైజ్" సినిమా కథ మొత్తం కేశవ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉంటుందని కొందరు చెబుతున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story