Allu Arjun: పుష్ప 2 కోసం బోయపాటి నీ పక్కన పెట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ కోసం బోయపాటి ఎదురుచూపులు

admin1
Updated on: 9 Jan 2022 9:30 PM IST
The Allu Arjun that Boyapati Srinu Put Next to You for Pushpa-2 Movie | Telugu Latest Movie
X

బన్నీ కోసం బోయపాటి ఎదురుచూపులు

Allu Arjun-Boyapati Srinu: 2016లో "సరైనోడు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ మరియు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ "అఖండ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక బన్నీ - బోయపాటి ల కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు అల్లు అర్జున్ మాత్రం పుష్ప షూటింగ్ పూర్తయ్యే వరకు షూటింగ్ మొదలు పెట్టాలని ఆసక్తి చూపించడం లేదట.

పుష్ప సినిమా బాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించడంతో పుష్ప 2 కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఉండబోతోందని తెలుస్తోంది. అల్లుఅర్జున్ మిగతా ప్రాజెక్టులు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పుష్ప షూటింగ్ సంక్రాంతి తరువాత సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో పుష్ప షూటింగ్ పూర్తయ్యే దాకా బోయపాటి బన్నీ కోసం ఎదురు చూడాల్సి ఉంది. మరి బన్నీ కోసం ఎదురు చూస్తారా లేక మరొక హీరో తో మరో సినిమా మొదలు పెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story