Agent: ఆరు నెలలలో ఆకాశం నుంచి నేలకి పడిపోయిన "ఏజెంట్" క్రేజ్

Agent: రోజురోజుకీ క్రేజ్ తగ్గిపోతున్న "ఏజెంట్" సినిమా విషయంలో భయపడుతున్న బయర్లు

Jyothi
Published on: 14 April 2023 7:40 AM IST
The Agent Craze that Fell from the Sky to the Ground in Six Months
X

Agent: ఆరు నెలలలో ఆకాశం నుంచి నేలకి పడిపోయిన "ఏజెంట్" క్రేజ్

Agent: అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికీ నాలుగు సినిమాల్లో నటించాడు. మొదటి మూడు సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో కొంత పర్వాలేదు అనిపించాడు. తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖిల్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ఏజెంట్" పైనే పెట్టుకున్నాడు. "సైరా నరసింహారెడ్డి" ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పెద్ద కారణాలు లేకుండానే సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

ఇక సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతుందని స్పై పాత్రలో అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించబోతున్నాడు అని వార్తలు వినిపించడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. సినిమాపై బజ్ ఎక్కువగా ఉండడంతో ఆరు నెలల క్రితం కూడా సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ తో 60 శాతం రేషియో కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమా విడుదల చాలా ఆలస్యం అయిపోతుండడంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది.

ఇక ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని కొనడానికి కూడా బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాతలే సినిమాని సొంతంగా విడుదల చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. క్రేజ్ ఉన్నప్పుడే విడుదల చేసి ఉంటే సినిమా ఎలా ఉన్నా హిట్ అయ్యేది కానీ ఇప్పుడు సినిమాపై ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి లేదు ఇప్పుడు సినిమా మంచి కలెక్షన్లు సాధించాలంటే కచ్చితంగా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంటుంది.

Jyothi

Jyothi

Next Story