శివాజీ రాజా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మెగా బ్రదర్

Ruthvik
Published on: 9 March 2019 4:11 PM IST
శివాజీ రాజా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మెగా బ్రదర్
X

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభఎన్నికల హడావిడి ఎలా ఉన్నా మరోవైపు 'మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)' ప్రెసిడెంట్ ఎన్నికల హంగామా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటిదాకా ప్రెసిడెంట్ గా వ్యవహరించిన శివాజీ రాజా లేదా నరేష్ లలో ఒకరు 'మా' కి ప్రెసిడెంట్ అవ్వనున్నారు. వీరద్దది మధ్యగట్టిగానే పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు మరియు కమిటీ మెంబర్లు వారిలో ఒకరికి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగ బాబు ఓపెన్ గా నరేష్ కి మద్దతు ఇవ్వడం ఇందులో కొత్తమలుపు తీసుకువచ్చింది.

ఈ మధ్యనే మీడియాతో మాట్లాడిన మెగా బ్రదర్ నాగబాబు 'మా' ఎన్నికల గురించి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈసారి ప్రెసిడెంట్ పదవి కొత్తవారికి దక్కితే బాగుంటుందని వాళ్ళ ప్రతిభ చూపే అవకాశం వారికి కూడా దక్కుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ప్రెసిడెంట్ గా వ్యవహరించిన శివాజీ రాజా నేతృత్వం లో జరిగినవి ఆయనకు నచ్చలేదని ఆయన శివాజీ రాజా తో అసంతృప్తిగా ఉన్నారంటూ షాకింగ్ కామెంట్ చేశారు. మరో వైపు ఈ సారి ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Ruthvik

Ruthvik

Next Story