Amala Paul:తెలుగు సినిమాల్లో అమలా పాల్ అందుకే కనిపించడం లేదా?

Amala Paul: అందుకే తమిళ సినిమాలు చేయటం లేదు అంటున్న అమలా పాల్

Jyothi
Updated on: 13 Sept 2022 9:49 AM IST
Thats Why Amala Paul is Not Appearing in Telugu Movies
X

తెలుగు సినిమాల్లో అమలా పాల్ అందుకే కనిపించడం లేదా?

Amala Paul: తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాక అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. "బెజవాడ" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమల ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు వంటి సినిమా లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. తాజాగా తెలుగు సినిమాలలో ఎందుకు నటించడం లేదు అనే విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ అప్పయింది అమలాపాల్.

తాను టాలీవుడ్ కి వచ్చిన కొత్తల్లో నీ ఇండస్ట్రీ మొత్తం కొన్ని పెద్ద కుటుంబాల చేతిలో ఉందని అర్థం చేసుకున్నానని చెప్పింది అమలాపాల్. "నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తల్లో అన్ని సినిమాలలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారు. వాళ్ళను కేవలం గ్రామర్ వే లోనే చూపించే వాళ్ళు. తెలుగు సినిమాల హీరోయిన్లను కేవలం పాటలు రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే కట్టిపడేసేవారని అనిపించింది," అని చెప్పుకొచ్చింది అమల పాల్. మొన్నటి వరకు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న అమలా పాల్ తాజాగా 2021 లో విడుదలైన "పిట్ట కథలు" అనే నెట్ ఫ్లిక్స్ యంతాలజీ లో కనిపించింది.

Jyothi

Jyothi

Next Story