అందుకే నాగ చైతన్య సినిమా గురించి నాగార్జున మౌనం వహించారా?

That is why Nagarjuna Kept Silent About Naga Chaitanyas Movie
x

అందుకే నాగ చైతన్య సినిమా గురించి నాగార్జున మౌనం వహించారా?

Highlights

Akkineni Nagarjuna: లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున...

Akkineni Nagarjuna: లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున తర్వాత అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నటుడు అక్కినేని నాగచైతన్య. కరియర్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత రెండు మూడు సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్నారు నాగచైతన్య.

వరుసహిట్లతో చై కరియర్ గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన "థాంక్యూ" సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. రాశి కన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సినిమాలో కొత్తదనం లేకపోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.

కథ చాలా రొటీన్ గా ఉందని అభిమానులు సైతం విమర్శలు కురిపిస్తున్నారు. "మనం" వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ను అక్కినేని కుటుంబానికి ఇచ్చిన విక్రమ్ కుమార్ ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులను నిరాశ పరుస్తోంది. అయితే ఇదిలా ఉండగా నాగార్జున ఈ సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కనీసం సినిమా గురించిన ఒక్క ట్వీట్ కూడా నాగార్జున చేయకపోవడం గమనర్హం. అయితే సినిమాకి ముందే సినిమా ఫ్లాప్ అవుతుందని గ్రహించిన నాగార్జున ఆ కారణంతోనే సినిమా గురించి మౌనం వహించారా అంటూ అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories