సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker Rejected Salman Khans Offer
x

సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్

Highlights

Tharun Bhascker: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రామిసింగ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ కూడా ఒకరు.

Tharun Bhascker: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రామిసింగ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ కూడా ఒకరు. 2016 లో "పెళ్లి చూపులు" సినిమాతో దర్శకుడిగా మారిన తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు. 2018 లో "ఈ నగరానికి ఏమైంది" ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు తరుణ్. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ తరుణ్ భాస్కర్ తదుపరి సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వెళ్లారు. ఆ షోలో మాట్లాడుతూ తన వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు తరుణ్ భాస్కర్.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక రీమేక్ సినిమా చేసే అవకాశం తనకి వచ్చిందని, ఈ నేపథ్యంలో ముంబై వెళ్లి మరి సల్మాన్ ని కలవటం జరిగింది కానీ తరుణ్ భాస్కర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే అది పెళ్లిచూపులు రీమేక్ అని నెటిజన్లు చెబుతున్నారు కానీ ఆ సినిమా ఏంటో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక విజయ్ దేవరకొండ తనకి ఒక ట్రంప్కార్డ్ అని వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు వస్తే విజయ్ తో సినిమా చేస్తానని అన్నారు తరుణ్ భాస్కర్.

Show Full Article
Print Article
Next Story
More Stories