"థాంక్యూ" రిజల్ట్ తో "దూత" పై మొదలైన అనుమానాలు

Thank You Movie Result Effect on Naga Chaitanya’s Dhootha Web Series
x

 "థాంక్యూ" రిజల్ట్ తో "దూత" పై మొదలైన అనుమానాలు

Highlights

Dootha Web Series: అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈమధ్యనే "థాంక్యూ" అనే సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు.

Dootha Web Series: అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈమధ్యనే "థాంక్యూ" అనే సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. వరుసగా సూపర్ హిట్ సినిమాల తో ముందుకు దూసుకుపోతున్న నాగచైతన్య కరియర్ లో "థాంక్యూ" సినిమా తో బ్రేకులు పడ్డాయి. ఇప్పటిదాకా నాగచైతన్య కరియర్ లోనే పెద్ద డిజాస్టర్ ఆయన "యుద్ధం శరణం" సినిమా కంటే ఈ సినిమాకి ఇంకా తక్కువ ఓపెనింగ్స్ రావటం అభిమానులను సైతం షాక్ కి గురిచేసింది.

విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ సినిమాతో అభిమానులను డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే "థాంక్యూ" సినిమా సమయంలోనే డైరెక్టర్ విక్రమ్ ఒక హారర్ కాన్సెప్ట్ తో "దూత" అనే వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశారు. కాన్సెప్ట్ నచ్చటంతో నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. అమెజాన్ ప్రైమ్ వారు ఈ వెబ్ సిరీస్ ని విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

కానీ "థాంక్యూ" సినిమా డిజాస్టర్ ఆయన తరువాత "దూత" సినిమాపై ఆ ఎఫెక్ట్ భారీగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు 45 కోట్ల దాకా ఖర్చు పెట్టానున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో నిర్మాతలు గట్టెక్కాలంటే ఈ వెబ్ సిరీస్ విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించాల్సిన అవసరం ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా నాగచైతన్య మంచి హిట్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories