Thank You Brother: ఓటిటిలో రిలీజ్‌కానున్న అనసూయ 'థాంక్యూ బ్రదర్'

Thank You Brother: ఆహా ఈ సారి `థాంక్ యూ బ్ర‌ద‌ర్‌`కూడా రిలీజ్ చేయనుంది.

Samba Siva Rao
Published on: 26 April 2021 5:48 PM IST
Thank You Brother is Going to Be Release in  OTT
X

థాంక్యూ బ్రదర్ పోస్టర్


Thank You Brother: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ మహమ్మరి ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీంతో థియేటర్స్ మళ్లీ మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో లాక్ డౌన్ కూడా పెట్టే ఆలోచనలో ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాలు విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. చిన్నా,పెద్ద సినిమాలన్ని ఓటీటీ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సినిమా కూడా ఇలాగే విడుదల చేస్తున్నారు.

`ఆహా`.. బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలింస్‌, ఒరిజినల్స్, వెబ్ షోస్‌ల‌తో ఈ వేస‌విలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హౌస్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ ఏడాదిలో క్రాక్‌, గాలి సంప‌త్, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, మెయిల్, తెల్ల‌వారితే గురువారం, చావు క‌బురు చ‌ల్ల‌గా వంటి సినిమాల రైట్స్ తీసుకున్న ఆహా ఈ సారి `థాంక్ యూ బ్ర‌ద‌ర్‌`కూడా రిలీజ్ చేయనుంది. అనసూయ నటించిన సినిమాను ఆహా ఓటిటి వేదికగా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఆహాలో మే 7న ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ `థాంక్ యూ బ్ర‌ద‌ర్‌` సినిమా డైరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది. అన‌సూయ‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'థాంక్యూ బ్రదర్'. ఈ చిత్రాన్ని ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి నిర్మించారు. ఓ యువ‌కుడు, గ‌ర్భ‌వ‌తి అయిన‌ మ‌హిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం 'థాంక్యూ బ్రదర్'.

`థాంక్యూ బ్ర‌ద‌ర్` చిత్ర ట్రైల‌ర్‌ను స్టార్ హీరో విక్టరీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు. రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, రానా ద‌గ్గుబాటి స‌హా నెటిజ‌న్స్ నుంచి మంచి ర‌స్పాన్స్ వ‌చ్చింది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే ప్ర‌స్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో మే 7న విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా` క్వాలిటీ తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కులకు నేరుగా అందిస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story