Tamannaah Bhatia: మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్ల దాడి..

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఇప్పుడు "బబ్లీ బౌన్సర్" అనే హిందీ సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది.

Arun Chilukuri
Updated on: 17 Sept 2022 7:01 PM IST
Thamanna Bouncers Attacked on Media Persons at Annapurna Studios
X

Tamannaah Bhatia: మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్ల దాడి..

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఇప్పుడు "బబ్లీ బౌన్సర్" అనే హిందీ సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కి సిద్ధమైంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. తెలుగు మీడియాని కూడా ఈ ప్రమోషన్ ఈవెంట్ కు ఆహ్వానించింది చిత్ర బృందం.

అయితే అక్కడికి వచ్చిన మీడియా వారిపై సెక్యూరిటీ గార్డ్ దురుసుగా ప్రవర్తించారు. వారిని దూషిస్తూ భౌతిక దాడికి కూడా పాల్పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ అయిపోయాక కొంతమంది మీడియా ప్రతినిధులు తమన్నాని ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించారు. కానీ దానికి అనుమతి లేదు అంటూ అక్కడున్న సెక్యూరిటీ గార్డులు మీడియాపై విరుచుకుపడ్డారు.

అసభ్యకరమైన పదజాలం కూడా వాడడంతో ఒక ఫోటోగ్రాఫర్ తిరిగి ప్రశ్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతనిపై భౌతికంగా దాడికి దిగింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒక బౌన్సర్ డస్ట్ బిన్ ను ఎత్తి దాడి చేస్తామని బెదిరించటం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇక సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సెక్యూరిటీ గార్డ్స్ తో ఆ ప్రెస్ ఫోటోగ్రాఫర్లకు క్షమాపణలు చెప్పించడంతో గొడవ సద్దుమణిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story