డైరెక్టర్ శంకర్ కూతురితో పాట పాడించిన థమన్

Thaman sang the song with director Shankar Daughter
x

 డైరెక్టర్ శంకర్ కూతురితో పాట పాడించిన థమన్

Highlights

Thaman: ఈమధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో మంచి హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు "గని" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Thaman: ఈమధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో మంచి హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు "గని" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర వంటి సీనియర్ నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఒక ఐటెం సాంగులో కనిపించబోతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లోని "రోమియో జూలియట్" అనే ఒక పాటని ఈ నెల 8 వ తారీఖున విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ పాటను పాడింది ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె. ఐశ్వర్య శంకర్ కి కొంచెం సినీ నేపథ్యం ఉంది. ఆమె ఈ పాటకి తన స్వరాన్ని అందించారు. శంకర్ కుటుంబానికి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న థమన్ చాలా క్లోజ్. అసలు థమన్ ను ఒక నటుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది శంకరే. దీంతో థమన్ "గని" సినిమా కోసం పట్టుపట్టి శంకర్ కుమార్తె ఐశ్వర్య తో ఈ పాట పాడించారు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories