Thaman: అందుకే ప్రభాస్ సినిమా నుంచి తప్పుకున్నాను అంటున్న థమన్

Thaman: ఆ డైరెక్టర్ వల్లే ప్రభాస్ సినిమా వదిలేసాను అంటున్న థమన్

admin1
Updated on: 25 Nov 2021 12:46 PM IST
Thaman Reacts About Rebel Movie Music Composing
X

 అందుకే ప్రభాస్ సినిమా నుంచి తప్పుకున్నాను అంటున్న థమన్ (ఫైల్ ఇమేజ్)

Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ కోసం క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థమన్ చేతుల్లో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. సర్కారు వారి పాట, అఖండ, భీమ్లా నాయక్, ఆచార్య వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్న థమన్ ఇప్పటిదాకా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తప్ప మిగతా అందరు హీరోలతో కలిసి పనిచేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి రియాక్ట్ అయ్యారు థమన్.

ఇంతకు ముందు ప్రభాస్ సినిమా నుంచి తానే తప్పుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. "నిజానికి ప్రభాస్ హీరోగా నటించిన 'రెబల్' సినిమా కి నేనే సంగీతాన్ని అందించాలి. కానీ సినిమా డైరెక్టర్ లారెన్స్ సంగీతం కూడా స్వయంగా అందించాలి అనుకున్నారు. ఆ సినిమా కోసం నేను చేయగలిగింది ఏమీ లేదని నాకు అర్థమైంది. అందుకే సినిమా నుంచి తప్పుకున్నాను. కానీ ప్రభాస్ తో మాత్రం భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పని చేస్తాను" అని చెప్పుకొచ్చారు థమన్. అంతేకాకుండా హీరోలు లేకుండా తాము జీరోల మని ఎందుకంటే ప్రేక్షకులకి తమ సంగీతాన్ని చెరువు చేసేది హీరోలే అని అన్నారు.

admin1

admin1

Next Story