Tollywood: తమన్ రెమ్యునరేషన్ పెంచాడంట.. ఎంతో తెలుసా?

Tollywood: మెలోడీలతో పాటు మాస్‌ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేస్తూ

Venkata Chari
Updated on: 4 May 2021 9:02 PM IST
Thaman Increased his Remuneration
X

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 

Tollywood: మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది 'క్రాక్‌', 'వకీల్‌సాబ్‌', 'వైల్డ్‌ డాగ్‌' లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో ఉన్నాడు. మెలోడీలతో పాటు మాస్‌ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్‌ చేస్తూ.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు పోటీగా నిలుస్తున్నాడు.

ప్రస్తుతం తమన్‌ బాలకృష్ణ 'అఖండ', మహేశ్‌ బాబు 'సర్కారు వారి పాట', పవన్‌ కల్యాణ్‌ 'అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌' రీమేక్‌, నాని 'టక్‌ జగదీశ్‌' అఖిల్‌ 'ఏజెంట్‌', శంకర్‌- రామ్‌చరణ్‌ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్‌.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా భారీగా పెంచేశాడట.

'అల వైకుంఠపురములో' వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునేవాడంట. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడంట. ఇక ఈ ఏడాది క్రాక్‌, వకీల్‌సాబ్‌ కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో.. మరో 50 లక్షలు పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తమన్‌ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు అందుకుంటున్నాడంట. కొన్ని సినిమాలకు బడ్జెట్‌ని బట్టి తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని ఇండస్ట్రీలో తమన్‌కు మంచి పేరుంది. ఇక రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story