Thalapathy Vijay: విజయ్, వంశీ పైడిపల్లి మూవీ స్టోరీ లీక్..

Thalapathy 66: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో "బృందావనం" సినిమా ఒక మర్చిపోలేని సూపర్ హిట్ అయింది.

Arun Chilukuri
Updated on: 22 April 2022 9:30 PM IST
Thalapathy Vijay Joining Hands With Vamsi Paidipally
X

Thalapathy Vijay: విజయ్, వంశీ పైడిపల్లి మూవీ స్టోరీ లీక్..

Thalapathy 66: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో "బృందావనం" సినిమా ఒక మర్చిపోలేని సూపర్ హిట్ అయింది. అప్పటిదాకా మాస్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గర చేసిన సినిమా అది. వంశీ పైడిపల్లి తన మార్క్ ఫ్యామిలీ డ్రామాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా సూపర్ హిట్ తోనే వంశీపైడిపల్లి ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా నిలదొక్కుకున్నరు. కాజల్ అగర్వాల్, సమంత వంటి హీరోయిన్లతో స్టార్ కాస్ట్ తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా వంశీ పైడిపల్లి ఇప్పుడు తమిళ్ స్టార్ విజయ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.

విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా ఒక పూర్తి ఫ్యామిలీ డ్రామా గా ఉండబోతోందని, బృందావనం లాగా ఒక కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుందని, బంధాలు బంధుత్వాల గొప్పతనం గురించి తెలియజెప్పే లాగా ఉండే ఈ సినిమా అందరూ కలిసి ఉంటేనే ఏ సమస్య అయినా పరిష్కరించగలం అనే మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్న విజయ్ ఇలాంటి సినిమా చేసి చాలా కాలం అయింది. మరి ఇలాంటి సినిమాతో విజయ్ ని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story