Thalapathy Vijay: టాలీవుడ్ పై ఆసక్తి చూపించని విజయ్...

Thalapathy Vijay: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్...

Shireesha
Published on: 10 April 2022 11:09 AM IST
Thalapathy Vijay is Not Interested in Tollywood Industry | Live News
X

Thalapathy Vijay: టాలీవుడ్ పై ఆసక్తి చూపించని విజయ్...

Thalapathy Vijay: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తాజాగా ఇప్పుడు "డాక్టర్" ఫేమ్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి కోలీవుడ్లో మాత్రమే కాక తెలుగులో కూడా విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరు. కాబట్టి ఈ సినిమా పై కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. "మాస్టర్" సినిమా సమయంలో తెలుగు ప్రేక్షకుల మీద మరియు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ల మీద బాగా దృష్టి పెట్టిన విజయ్ ఈ సారి మాత్రం టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

హైదరాబాద్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన ఎవెంట్లు ఏవి నిర్వహించడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఎవరు కూడా హైదరాబాద్లో సినిమా ప్రమోషన్స్ ను చేయటం లేదు. మరోవైపు తెలుగు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ తమిళ్ లో కూడా తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటే విజయ్ మాత్రం తన సినిమా ప్రమోషన్స్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

Shireesha

Shireesha

Next Story