Lokesh Kanagaraj: విజయ్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో జాయిన్ అవుతున్నారా?

* తాజా సమాచారం ప్రకారం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది కూడా ఒక భాగం కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

R Tripura Malini
Published on: 21 Nov 2022 12:05 PM IST
Thalapathy Vijay Is Likely To Join Lokesh Cinematic Universe
X

Lokesh Kanagaraj: విజయ్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో జాయిన్ అవుతున్నారా?

Thalapathy Vijay: "మానగరం" సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ కి పరిచయమైన లోకేష్ కనగరాజ్ కార్తి హీరోగా నటించిన "ఖైదీ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తరువాత "మాస్టర్" సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ ఈ మధ్యనే విడుదలైన "విక్రమ్" సినిమాలో "ఖైదీ" పాత్రలను కూడా జోడించి కోలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే టాగ్ తో సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించారు. ఇప్పటిదాకా ఖైదీ, విక్రమ్ అని లోకేష్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. రెండూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే తాజాగా ఈ యూనివర్స్ లోకి మరొక కొత్త సినిమా యాడ్ అవబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అదే #తలపతి67. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అదే #తలపతి67. తాజా సమాచారం ప్రకారం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది కూడా ఒక భాగం కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. గతంలో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ "మాస్టర్" అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ, కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు. తాజాగా ఇప్పుడు విజయ్ కూడా ఈ జాబితాలో చేరనున్నందుకు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story