Thalapathy Vijay: ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లకు విజయ్ దిమ్మ తిరిగే షాక్

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

Dhatripriya
Updated on: 24 May 2023 3:30 PM IST
Thalapathy Vijay Charged a Whopping Rs150 Crore
X

Thalapathy Vijay: ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లకు విజయ్ దిమ్మ తిరిగే షాక్

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. సినిమా సినిమాకి క్రేజ్ పెంచుకుంటున్నారు. వారసుడు సినిమా కోసం 105 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని అందర్ని ఆశ్చర్యపరిచిన దళపతి తన తదుపరి చిత్రానికి ఏకంగా రూ.150 కోట్లు ఛార్జ్ చేశారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఫిలిమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ నిజంగానే రూ.150 కోట్లు తీసుకోవడం నిజమైతే..సౌతిండియా ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోగా రికార్డులకెక్కడం ఖాయం.

విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్ మీద ఉండగానే డైరెక్టర్ వెంకట్ ప్రభు, ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రూపొందే చిత్రానికి విజయ్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే విజయ్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంతేకాక ఈ సినిమా రిలీజై వచ్చే లాభాల్లో సైతం షేర్ తీసుకుంటాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది.

విజయ్ సినిమాలకు తమిళం, ఓవర్సీస్ లో మార్కెట్ ఎక్కువ. లియో సినిమాకు రూ.400 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ కు రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పే లేదని దళపతి ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ సినిమాలకు మార్కెట్ ఉంది కాబట్టే ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సైతం ముందుకొస్తున్నారని చెబుతున్నారు. ఏదిఏమైనా, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి హీరోలకు దళపతి షాక్ ఇచ్చినట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story