Thalaivi: 'తలైవి'లో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్..ఫస్ట్ లుక్ రిలీజ్

thalaivithefilm
x

తలైవి ఫైల్ ఫోటో 

Highlights

Thalaivi: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం 'తలైవి'.

Thalaivi: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం 'తలైవి'. పాన్ ఇండియన్ మూవీగా 'తలైవి' చిత్రం రూపొందుతుంది. మంగళవారం (మార్చి23)న జయలలిత జయంతి సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'తలైవి' జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయింది. అంతలా జయలలిత పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది అంటూ కంగనా నటనను మెచ్చుకుంటున్నారు.

ట్రైలర్‌ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఎంజీఆర్‌ పాత్రలో అరవిందస్వామి నటించారు. అయితే ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ పాత్రలో మధుబాల నటిస్తున్నారు. ఈ రోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా లుక్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా మధుబాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇక ఈ రోజు విడుదల చేసిన పోస్టర్‌లో ఆసుపత్రిలో బెడ్ పై పడుకున్న రామచంద్రన్‌ను అప్యాయంగా మాట్లాడుతున్న మదుబాల ఫోటోను విడుదల చేశారు. ఈ'తలైవి' విషయానికొస్తే..ఈ సినిమాకి కేఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విబ్రీ మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రారంభోత్సం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కంగనాపై ట్రోల్స్‌ వచ్చినా, ట్రైలర్‌తో గట్టి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories