The Raja Saab: 'ది రాజా సాబ్ 2' పక్కా.. కానీ సీక్వెల్ మాత్రం కాదు: టీజీ విశ్వప్రసాద్

The Raja Saab: ది రాజా సాబ్ 2 పక్కా.. కానీ సీక్వెల్ మాత్రం కాదు: టీజీ విశ్వప్రసాద్
x
Highlights

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమైన ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హారర్ కామెడీ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది.

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రమైన ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హారర్ కామెడీ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది.

తాజాగా ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “‘ది రాజా సాబ్ 2’ కచ్చితంగా ఉంటుంది. కానీ ఇది మొదటి భాగానికి సీక్వెల్ కాదు,” అని తెలిపారు. మొదటి సినిమాలోని హారర్ కామెడీ నేపథ్యంలోనే, కొత్త కథతో ఈ చిత్రం ఫ్రాంచైజీగా కొనసాగుతుందన్నారు. ఇది సలార్, కల్కి తరహాలో మరో ప్రత్యేకమైన ప్రభాస్ బ్రాండ్‌గా నిలవనున్నదని అర్థమవుతోంది.

ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ్ తుది దశలో ఉంది. మేజర్ షూటింగ్ పూర్తయిందని, కొద్ది పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. అక్టోబర్ చివరి నాటికి సినిమా మొత్తం పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నారు.

విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయాలన్న అభిప్రాయం ఓ వైపు ఉండగా, హిందీ వర్గాలు డిసెంబర్ 5, 2025న రిలీజ్ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రభాస్‌కు తాతగా కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదట 4.5 గంటల నిడివితో ప్లాన్ చేసిన ఈ సినిమాను మారుతి దాదాపు 2 గంటల 45 నిమిషాలకు కుదించారని, ఫైనల్ వెర్షన్ 3 గంటల వరకూ ఉండొచ్చని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories