Telugu TV actress Corona Positive: తెలుగు సీరియల్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్‌

Telugu TV actress Corona Positive: కరోనా వైరస్ విజృంభణ తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది.

Samba Siva Rao
Published on: 1 July 2020 7:00 PM IST
Telugu TV actress Corona Positive: తెలుగు సీరియల్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్‌
X

Telugu TV actress tested Corona Positive: కరోనా వైరస్ విజృంభణ తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా నిలిచిపోయాయి. ప్రభుత్వం అనుమతితో జూన్ 1 నుంచి టీవీ షూటింగులకు మళ్లీ పునః ప్రారంభించారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకడంతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది.

ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ నటీనటులకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. తాజాగా మరో టీవీ నటికి కరోనా సోకినట్లు తెలిసింది. 'ఆమె కథ' సీరియల్‌ హీరోయిన్‌ నవ్య స్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత మూడు, నాలుగు రోజులుగా ఆమె తలనొప్పి, అలసటతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కరోనా టెస్టు చేయించగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. రెండు వారాల నుంచి ఆమె టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నవ్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న వారందరికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నవ్య స్వామి 'రాత్రంతా నిద్ర పోలేదు ఉదయం వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. నా బాధ చూసి మా అమ్మ కూడా ఏడుస్తూనే ఉంది. నా ఫోన్‌ బిజీగా ఉంది. కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. చాలా మందితో మాట్లాడాను. నా వాట్సాప్‌ మొత్తం కరోనా లక్షణాలు, చికిత్సకు సంబంధించిన మెసేజ్‌లతో నిండిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. నా సహనటులు, ఇతర సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు చాలా బాధపడుతున్నాను అని అన్నారు. నేను శారీరకంగా కంటే మానసికంగా.. బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారంతా ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను' నవ్య అన్నారు .

Samba Siva Rao

Samba Siva Rao

Next Story