తెలుగు సినిమా సందడి మొదలవుతోంది

తెలుగు సినిమా సందడి మొదలవుతోంది
x
Highlights

షూటింగ్ లకు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇవ్వడంతో టీవీ, సినీ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన నటీనటులు మళ్లీ మేకప్...

షూటింగ్ లకు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇవ్వడంతో టీవీ, సినీ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన నటీనటులు మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. మధ్యలో ఆగిపోయిన షూటింగ్ లు మళ్లీ మొదలుకానున్నాయి. కొత్త సినిమాలు రానున్నాయి. రిపీట్ సీరియల్స్ బంద్ అయి కొత్త సీరియల్స్ అలరించనున్నాయి.

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో టీవీ, సినిమా షూటింగులకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. లాక్ డౌన్ గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు పచ్చ జెండా ఊపాయి. రెండున్నర నెలల విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లైట్స్ , కెమెరా, యాక్షన్ మాటలు వినిపించనున్నాయి. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మధ్యలో ఆగిపోయిన షూటింగ్స్ మళ్లీ ప్రారంభంకానున్నాయి. కొత్త సినిమాలు ఓపెనింగ్స్ కు రెడీ అవుతున్నాయి. లోకేషన్స్ వెళ్లేందుకు డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు.

దాదాపు రెండున్నర నెలలు ముఖానికి మేకప్ లేకుండ వున్నా నటీనటులు మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. బుల్లి తెర తారలు సీరియల్స్ తో అలరించబోతున్నారు. ఇప్పటి వరకు రిపీట్ సీరియల్స్ తో బోరు కొట్టించిన స్టార్స్ తమ నటన, పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకోనున్నారు. ఇంకో వారం నుండి కొత్త సీరియల్స్ తో కనిపించబోతున్నారు. షూటింగ్ లకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో సినీ పరిశ్రమలో మళ్లీ సందడి నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories