logo
సినిమా

Telugu Movies: బాక్పాఫీస్‌ను ఢీ కొట్టబోతున్న నితిన్, రానా దగ్గుబాటి

Telugu Movies Releasing on Friday 26th March 2021
X
రంగ్ దే, అరణ్య పోస్టర్లు (ఫొటో ట్విట్టర్)
Highlights

Telugu Movies: ఈ శుక్రవారం టాలీవుడ్ లో 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే అందులో అందరి చూపు రెండు సినిమాలపై నే ఉంది.

Telugu Movies: ఈ శుక్రవారం టాలీవుడ్ లో 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే అందులో అందరి చూపు రెండు సినిమాలపై నే ఉంది. నితిన్, కీర్తి సురేష్ కాంబో రానున్న 'రంగ్ దే' (Rang De), దగ్గుబాటి రానా డిఫరెంట్ గా ట్రై చేస్తున్న 'అరణ్య' సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అలాగే సర్వం సిద్ధం (Sarvam Siddam), ఇచ్చట వాహనములు నిలుపరాదు (Ichata Vaahanamulu Nilupa Raadhu), ఎస్‌ఆర్ కళ్యాణమండపం (SR Kalyanamandapam) సినిమాలు కూడా జనాల ముందుకు రాబోతున్నాయి. అయితే రంగ్ దే, అరణ్య సినిమాలపై టాలీవుడ్ లో చాలా హైప్ క్రియోట్ అయింది. మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా మెప్పిస్తుందో చూడాలి.

కాగా, నితిన్ రెండు వారాల గ్యాప్ లో రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చెక్ సినిమా బాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమాతో మళ్లీ ఫాంలోకి రావాలని నితిన్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'రంగ్ దే' సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అయితే ఇదే బ్యానర్ లో నితిన్ హీరోగా వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్ అవడంతో.. 'రంగ్ దే' పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రోమాన్స్ కాదు.. కామోడీ కూడా కీలకంగా మారనుందని వార్తలు వినిసిస్తున్నాయి. సెన్సార్ యూనిట్ కూడా అదే చెప్పడంతో ఫీల్ గుడ్ మూవీలా అలరిస్తుందో లేదో చూడాలి.

ఇక, రానా దగ్గుబాటి ప్రతీ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అందరు హీరోలు మాదిరిగా రొటీన్ కమర్షియల్ పంథాలో పోకుండా.. నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్నారు. అరణ్య' చిత్రం ఈ కోవలోకే వస్తుంది.

ప్రభు సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ హిందీలో హాథీమేరేసాథీ, తమిళంలో కాదన్‌, తెలుగులో 'అరణ్య' (Aranya) అనే టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. యానిమ‌ల్ కాన్‌ఫ్లిక్ట్ కథాంశంతో.. ఏనుగులు, అడవి నేపథ్యంలో దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించిన ఈ కథలో రానా విలక్షణ పాత్రలో కనిపించారు.

1. రంగ్ దే (Rang De)

నటీనటులు: నితిన్ (‍Nithin), కీర్ది సురేష్ (Keerthi Suresh)

డైరెక్టర్: వెంకీ అట్లూరి (Venky Atluri)

2. అరణ్య (Aranya)

నటీనటులు: రానా దగ్గుబాటి (‍Rana Daggubati), జోయా హుస్సేన్ (Zoya Hussain)

డైరెక్టర్: ప్రభు సాల్మోన్ (Prabhu Solomon)


Web TitleTelugu Movies Releasing on Friday 26th March 2021
Next Story