Lavakusa : 'లవకుశ' సినిమా నటుడు నాగరాజు ఇక లేరు!

Lavakusa : లవకుశ సినిమా నటుడు  నాగరాజు ఇక లేరు!
x
Highlights

Lavakusa : 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం 'లవకుశ' సినిమా అందరికి బాగా గుర్తుండే ఉంటుంది.. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు

Lavakusa : 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం 'లవకుశ' సినిమా అందరికి బాగా గుర్తుండే ఉంటుంది.. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు , అంజలీదేవి , కాంతారావు, నాగరాజు, సుబ్రహ్మణ్యం, చిత్తూరు నాగయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి సి.పుల్లయ్య-సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. 1934లో బ్లాక్ అండ్ వైట్లో లవకుశను దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది.

1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆర్థిక కారణాలతో సినిమా చిత్రీకరణ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య అనారోగ్యం పాలుకావడంతో ఆయన కుమారుడు సి.ఎస్.రావు పున:ప్రారంభం తర్వాత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. మొత్తానికి ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని 1963లో 26 కేంద్రాల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది..

ఈ సినిమాలో లవకుశులుగా వేసిన మాస్టర్ సుబ్రహ్మణ్యం, మాస్టర్ నాగరాజులు నటించారు. అయితే దురదృష్టవశాత్తూ కొద్దిసేప‌టి క్రితం నటుడు నాగ‌రాజు అనారోగ్యంతో క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఉన్న త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయన మృతి పట్ల సినిమా పరిశ్రమ సంతాపం తెలుపుతుంది. ఇక లవకుశతో పాటుగా ఆయన భక్తరామదాసు చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. అయన అసలు పేరు నాగేందర్‌రావు. సుమారుగా 300 చిత్రాల్లో అయన నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories