Telugu Latest Movies: లో బడ్జెట్ సరే.. మరీ ఇంత పిసినారితనమా?

jathi rathnalu, gaalisampath Movie Budget
x

జాతిరత్నాలు, గాలిసంపత్ మూవీ స్టిల్స్ 

Highlights

Telugu Latest Movies: నిర్మాతకు కాసిన్ని డబ్బులు మిగల్చాలని షూటింగ్ ముందే భావించినట్లు ఉన్నారు.

Tollywood: ఈ వారం నాలుగు సినిమాలు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా విడుదల అయ్యాయి. వాటిలో తెలుగు సినిమాలు మూడు ఉంటే, ఒకటి కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఉంది. తెలుగు చిత్రాలు 'గాలి సంప‌త్‌', 'జాతిర‌త్నాలు', 'శ్రీకారం' ఉన్నాయి. మరొకటి కన్నడ యాక్షన్ థ్రిల్లర్ 'రాబర్ట్'. విడుదల అయిన మూడు స్ట్రయిట్ సినిమాలూ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. అయితే కాసేపు 'రాబర్ట్' ను పక్కన పెడతాం. తెలుగు సినిమాల విషయానికి వస్తే శర్వానంద్ 'శ్రీకారం' మినహాయించి, మిగిలిన రెండు చిత్రాలు లోబడ్జెట్‌లో నిర్మించినవే.

అయితే చిన్న సినిమాల క్వాలిటీ విషయంలో డైరెక్టర్లు రాజీపడినట్లు ఉన్నారు. జాతిరత్నాలు, గాలి సంపత్ క్వాలిటీ లెస్ గా తీశారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జేట్ సినిమాకు లోబడ్జేట్ సినిమా తేడా చూపించారని సినీప్రియులు వ్యంగాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే ఇద్దరు డైరెక్టర్లు, నిర్మాతకు కాసిన్ని డబ్బులు మిగల్చాలని షూటింగ్ ముందే భావించినట్లు ఉన్నారు. కథలో బలం ఉన్నా.. బ‌డ్జెట్‌లో పూర్త‌యిపోయే క‌థ‌ల‌నే ఎంచుకున్నా.. తెర‌పై క్వాలిటీ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌లేక‌పోయారు. షార్ట్ ఫిల్మీంలే చాలా హైక్వాలిటీతో చూపిస్తున్నారు. అటువంటిది ఈ రెండు చిత్రాల దర్శకులు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేకపోయారు. పోని నిర్మాతలు కొత్తవారా అని అనుకోవడానికి వీళ్లేదు. నిర్మాణ విలువలు విషయంలో ఎవరూ రాజీ పడేవారు కాదు. జాతిర‌త్నాలు మూవీకి `మ‌హాన‌టి`, `ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం` తీసిన నాగ అశ్విన్ నిర్మాత‌ కాగా.. గాలి సంప‌త్‌ అయితే ప్రముఖ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతగా ఉన్నారు‌.

నిర్మాణ విలువల్లో `జాతిర‌త్నాలు`లో అయితే మ‌రీనూ. మూవీలో కీలక లొకేష‌న్లు, కాస్ట్యూమ్స్‌ విష‌యాల్లోనూ పిసినారి త‌నం చూపించారు. 'గాలి సంపత్ 'లోని కొన్ని సీన్న్‌లో కాస్ట్యూమ్స్ పై అభిమానులు జోక్స్ వేసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో ఎలా ఉన్నా రెండు సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.విడుదల రోజు శివరాత్రి సెలవుదినం కావడంతో థియేటర్లకు జనం క్యూ కట్టారు. దీంతో తొలి రోజు అన్ని సినిమాలకు భారీగానే కలెక్షన్లు వచ్చాయని సినీ వర్గాలు అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories