సంచలన నిర్ణయం తీసుకున్న ఫిలిం ఛాంబర్‌.. రేపటి నుంచి షూటింగ్స్‌ బంద్‌..

Tollywood: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు.

Arun Chilukuri
Updated on: 31 July 2022 4:24 PM IST
Telugu Film Shootings Stop from August 1
X

సంచలన నిర్ణయం తీసుకున్న ఫిలిం ఛాంబర్‌.. రేపటి నుంచి షూటింగ్స్‌ బంద్‌..

Tollywood: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించారు. సినిమా షూటింగ్స్ బంద్‌కు పిలుపునిస్తూ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ ఛాంబర్ మద్ధతు తెలిపింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులు సినిమా చిత్రీకరణ ఆపేస్తున్నట్లు ఫిలిం చాంబర్‌ చైర్మన్‌ బసిరెడ్డి తెలిపారు. అన్ని సమస్యలను సమావేశాల ద్వారా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు. షూటింగ్‌లు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో త్వరలో చెబుతామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story