ప్రసన్న కుమార్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలి.. ఇండస్ట్రీని అవమానిస్తే ఊరుకునేది లేదన్న..

Telugu Film Producers Council: కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా నిర్మాతలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 10 Jan 2022 7:21 PM IST
Telugu Film Producers Council Slams Nallapareddy Prasanna Kumar Reddy
X

ప్రసన్న కుమార్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలి.. ఇండస్ట్రీని అవమానిస్తే ఊరుకునేది లేదన్న..

Telugu Film Producers Council: కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా నిర్మాతలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజా నిజాలు తెలియకుండా గౌరవ శాసన సభ్యులు ఇలా వ్యాఖ్యానించడం తగదని, ఇది తమను అవమానించడమేనని నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని మిగిలిన వారందరివీ నష్టాలేనని మండలి తెలిపింది. కోట్లు ఖర్చు చేసి, ఆస్తులు అమ్ముకుని నిర్మాతల మండలి నుంచి నెలకు మూడు వేలు పెన్షన్ పొందుతున్న నిర్మాతలు కూడా ఉన్నారని మండలి కామెంట్ చేసింది. నల్లపురెడ్డి తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆ సంఘం డిమాండ్ చేసింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story