Telugu Cinema 2019: ఘాటు సీన్లు.. హాటు ముద్దులకు నో చెప్పిన తెలుగు ప్రేక్షకులు

Telugu Cinema 2019: ఘాటు సీన్లు.. హాటు ముద్దులకు నో చెప్పిన తెలుగు ప్రేక్షకులు
x
Highlights

ఈ సంవత్సరం ఘాటు సీన్లతో నిండిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు నిర్ద్వంద్వముగా తిరస్కరించారు.. ఆ సినిమాల పై ఓ లుక్ వేద్దాం..

ఓ ఆరుపలకల కండల హీరో.. అందాల ఆరబోతకు సై అనే నేటి తరం హీరోయిన్.. మూడు కౌగిలింతలు.. ఆరు ఘాటు ముద్దు సీన్లు.. కుదిరితే ప్రేమ కథ.. లేకపోతే ధ్రిల్లర్ స్టోరీ ఇదే ఫార్ములాను నమ్ముకుని తెలుగు తెర మీద విశృంఖలంగా విజ్రుమ్భించి.. కాసులు కొల్లగోట్టేడ్డామనుకునే దర్శక నిర్మాతలకు ఈ సంవత్సరం గట్టి దెబ్బ పడింది. కథలో విషయం లేకపోతే ముద్దు సీనైనా.. మరోటైనా చూసే సీనే లేదు అంటూ నిర్ద్వంద్వంగా పక్కన పెట్టేశారు తెలుగు ప్రేక్షకులు.

ఆర్ఎక్స్ 100 తో మొదలు!

గత సంవత్సరం 'ఆర్ఎక్స్ 100 ' సినిమా వచ్చింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుట్ హీరో హీరోయిన్లు. వీరిద్దరి మధ్య బోల్డ్ ముద్దులు.. బూతు సన్నివేశాలు సినిమాలో అడుగడుగునా కనిపించాయి. కానీ, సినిమాలో ఉన్న ఒక్క పాయింట్ యూత్ కి నచ్చేసింది. ఆ పాయింట్ చుట్టూ ఉన్న ఈ అడల్ట్ కంటెంట్ అదనపు ఆకర్షణ అయింది. దీంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడడమే కాకుండా లాభాల్నీ తెచ్చిపెట్టింది. కార్తికేయ..పాయల్ సినీ కెరీర్ కు మంచి భవిష్యత్ ఇచ్చింది. అంతే.. కట్ చేస్తే.. 2019 వచ్చేసింది. ఆర్ఎక్స్ 100 లాంటి సినిమా తీయాలని పోటీ మొదలైంది.

కొత్తగా మొదలెడుతున్నాం అన్నారు..

ఈ సంవత్సరం కొత్తగా మొదలెడతాం అంటూ వచ్చింది 'కొత్తగా మా ప్రయాణం' అంటూ యూత్ లవ్ స్టోరీ అని ప్రచారం చేశారు. ప్రచార చిత్రాలు యూత్ ని టార్గెట్ చేస్తూ విడుదల చేశారు. కానీ, సినిమాలో అదే ప్రధానం అయిపోయి యూత్ కూడా ఆ సినిమాని పక్కన పెట్టేశారు.

4 లెటర్స్..

ఫిబ్రవరిలో 4 లెటర్స్ అనే సినిమా వచ్చింది. ఇది కూడా అదే ధోరణి.. అంతా కొత్త వాళ్ళతో ఈ సినిమా తీసారు. కథ మాట ఎలా ఉన్నా.. టైటిల్ కీ సినిమాకీ సంబంధం లేని రీతిలో కొత్త తరహా అడల్ట్ సీన్లు దట్టించి వదిలిన ఈ సినిమా మొదటి షో తోనే మాయం అయిపోయింది.

పేరులోనే ద్వంద్వార్థం!

కంటెంట్ వరకూ కూడా కాకుండా పేరులోనే డబుల్ మీనింగ్ కనిపిస్తే జనాలు సినిమా చూడటానికి పరిగేట్టేస్తారనుకునున్నారో ఏమో ఈ ఏడాది మార్చిలో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అంటూ ఓ సినిమాని వదిలారు. అయితే, ఈ సినిమాని హారర్ సినిమాగా పరిచయం చేశారు. కానీ, ఘాటు వాల్ పోస్ట్ లు.. టీజర్లు సినిమాలో ఎదో ఉండనిపించేలా చేశారు. కానీ, అంత చితక్కొట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సినిమాని తిరస్కరించారు ప్రేక్షకులు.

రాయ్ లక్ష్మీ యాజ్ వెంకటలక్ష్మి..

కొద్దోగొప్పో పేరున్న నటి రాయ్ లక్ష్మి. ఆమెను హీరోయిన్ గా పెట్టి దటీజ్ వెంకట లక్ష్మి అని సినిమా వదిలారు. ప్రచారం చక్కగా చేశారు. సినిమా కొద్దిగా చూడబుల్ గా ఉంటుందని అందరూ భావించారు. కానీ, రాయ్ లక్ష్మి తో పలికించిన డబుల్ మీనింగ్ డైలాగులు.. సినిమా అంతా పరిచేసిన అడల్ట్ కంటెంట్ వంటి సన్నివేశాలు ప్రేక్షకులకు రుచించలేదు. దాంతో రెండో రోజే తట్టా బుట్టా సర్దేసింది వెంకట లక్ష్మి.

రొమాంటిక్ క్రిమినల్స్..

ఇది మే నెలలో వచ్చింది. సినిమా మంచి సినిమా అయివుండేది. కానీ, ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ చొప్పించి వదిలారు. దాంతో ప్రేక్షకులు ఈ క్రిమినల్స్ రోమాన్స్ ని తిరస్కరించారు.

నేను లేను..

ఇక ఇదే కోవలో వెరైటీ కథ అంటూ నేను లేను అనే సినిమా జూలై నెలలో వచ్చింది. సినిమా మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అనిపించేలా ప్రచారం చేశారు. సినిమా కూడా కొత్తగానే అనిపిస్తుంది. కథ కూడా బాగానే ఉంటుంది. కానీ, యూత్ సినిమాకి రావలన్న కసితో కసెక్కించే అడల్ట్ కంటెంట్ సినిమాలో అనవసరంగా చొప్పించి.. సినిమా కాన్సెప్ట్ పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో సినిమా బాక్సాఫీసు ముందు చతికల పడింది.

ఆర్ఎక్స్ 100 లానే.. ఆర్డీఎక్స్!

ఇక అక్టోబర్ లో అచ్చం ఆర్ఎక్స్ 100 లా అనిపించేలాంటి టైటిల్ తో అదే హీరోయిన్ పాయల్ ని తీసుకుని ఆర్డీఎక్స్ అంటూ సినిమా వదిలారు. సినిమాలో విషయం లేకపోతే..పేరూ హీరోయిన్..కామ సూత్రాలు తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా తోసిపారేస్తారని రుజువు చేసింది ఈ ఆర్ద్దేక్స్. పాయల్ అందాల ఆరపోత కూడా సినిమాని రక్షించలేదు.

ఇక ఇవే కాకుండా ఏడుచేపల కథ, రాయలసీమ లవ్ స్టోరీ ఇలా కొన్ని సినిమాలు వరుసగా వచ్చాయి వెళ్ళాయి. ఈ సినిమాలు ఆడకపోవడానికి కారణం దాదాపుగా ఒక్కటే. అడల్ట్ కంటెంట్.. ఘాటు బూతు సన్నివేశాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతారనుకున్న నిర్మాతల, దర్శకుల వేర్రితనమే. వీటిలో కొన్ని సినిమాల్లో మంచి కథ..కథనాలు ఉన్నాయి. వాటిని నమ్ముకుని ఉంటె అవి మంచి సినిమాలుగా నిలబడి ఉండేవి. కాసుల కక్కుర్తి తో సినిమాల్లో బూతు సన్నివేశాలు ఉంటె చాలని భావించిన దర్శక నిర్మాతల ధోరణితో అవి ఆ విధంగానూ నిలబడే అవకాశం కోల్పోయాయి.

మొత్తమ్మీద అడల్ట్ కంటెంట్ తోనో.. బూతు సన్నివేశాలతోనో..సినిమాలు చుట్టేద్దమనుకునే వారికి ఈ సంవత్సరం ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. సినిమా వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులు బూతును ఒప్పుకోవడం లేదని మరోసారి రుజవైంది. కథ కథనాలు బావుండి.. కొంత వరకూ అందులో భాగంగా సినిమాలో అటువంటి సన్నివేశాలుంటే ఫర్వాలేదు కానీ, ఆ సన్నివేశాల చుట్టూ సినిమా తీసేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా కుదరదనే విషయాన్ని రాబోయే సంవత్సరంలో నిర్మాతలు గుర్తించి.. మంచి సినిమాలు తీస్తారని ఆశిద్దాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories