గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గంగవ్వ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గంగవ్వ
x
Highlights

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామం ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అయితే తాజాగా బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్, మై విలేజ్ షో గంగవ్వ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామం ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని గంగవ్వ తెలిపారు. మొక్కలతోనే పర్యావరణ సమతుల్యత ఏర్పడుందని వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గంగవ్వ పిలుపు నిచ్చారు. అటు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories