రామ్ చరణ్ సినిమాలో తెలుగు బ్యూటీ

Ram Charan: ఆర్సీ15 షూటింగ్ కి వెళ్తున్న అంజలి.

admin1
Published on: 20 Feb 2022 2:46 PM IST
Telugu Beauty In Ram Charan Movie
X

రామ్ చరణ్ సినిమాలో తెలుగు బ్యూటీ

Ram Charan: యంగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "ఆర్సీ15" అని పిలవబడుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన "వినయ విధేయ రామ" సినిమాలో హీరోయిన్ గా నటించింది కియరా. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో అంజలి కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాలో కనిపించిన అంజలి త్వరలోనే "ఎఫ్ 3" సినిమాలో కూడా కనిపించనుంది. రామ్ చరణ్ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించేందుకు రెడీ అయింది అంజలి. తాజాగా షూటింగ్ సెట్స్ కి వెళ్తూ కార్ లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ, "అసలు వెకేషన్ అవసరం రాని జాబ్ చేయండి. ఆర్సీ15 సెట్స్ కి వెళ్తున్నాను" అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దిల్ రాజు మరియు శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story