Telangana: తెలుగు హీరోలని కలిసిన తెలంగాణా మంత్రి

Telangana: తెలంగాణా రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుమారుడు డాక్టర్ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితో

Sandeep Reddy
Updated on: 5 July 2021 4:04 PM IST
Telangana Minister Meets Tollywood Heros
X

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ , పువ్వాడ నయన్ (ఫోటో : న్యూస్ 18  )

Telangana: తెలంగాణా రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుమారుడు డాక్టర్ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్ లను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన పువ్వాడ అజయ్ మరియు అతని కుమారుడు పుష్పగుచ్చంతో పాటు శాలువతో ఎన్టీఆర్ ను సత్కరించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు చిరంజీవి లను కలవడం పై అటు సినిమాతో పాటు రాజకీయ వర్గాలలోను చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం డాక్టర్ గా ఉన్న తన కుమారుడిని సినిమా రంగంలోకి దించబోతున్నాడని కొందరు అనుకుంటే మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ మరియు చిరంజీవి కి పువ్వాడ నయన్ వీరాభిమాని అని అందుకోసమే తన పుట్టిన రోజున ఆ ఇద్దరి హీరోలని కలిసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోపక్క వీరిద్దరితో పాటు పువ్వాడ అజయ్.. కేటీఆర్ నూ తన స్వగృహంలో కలిసి ఆశీర్వాధాలు తీసుకున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ ట్విట్టర్ వేదిక ఫోటోలను పోస్ట్ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story