సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మల్లీప్లెక్స్ లో గరిష్ట ధర రూ.250కి పెంపు మల్లీప్లెక్స్ రిక్లైనర్ సీట్ల ధరను గరిష్టంగా రూ.300కు పెంచుకోవడానికి అనుమతి

Sandeep Reddy
Published on: 24 Dec 2021 5:57 PM IST
Telangana Government Green Signal to Increase the Movie Ticket Price
X

సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో కనీస ధర 100, గరిష్ట ధర 250కి పెంచింది. మల్లీప్లెక్స్ రిక్లైనర్ సీట్ల ధరను గరిష్టంగా 300కు పెంచుకోవడానికి అనుమతించింది.

ఏసీ థియేటర్లలో కనీస ధర 50, గరిష్ట ధర 150గా నిర్ణయించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం కాగా.. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు 5, నాన్ ఏసీ థియేటర్లు 3 వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story