ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

RRR Movie: త్రిబుల్ ఆర్‌ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 19 March 2022 3:45 PM IST
Telangana Government Allows Ticket Price Hike for RRR
X

ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

RRR Movie: త్రిబుల్ ఆర్‌ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు పెంచుకునేందుకు, వారం తర్వాత 30 రూపాయలు పెంచుకునేందుకు సర్కార్ వెసులుబాటు కల్పించింది. మల్టీప్లెక్స్, ఐమాక్స్ థియేటర్లలో మొదటి మూడు రోజులు వంద రూపాయలు, తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకునేందుకు జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్. మార్చి 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కూడా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story