ముద్దు సన్నివేశాల గురించి ఈ షాకింగ్ కామెంట్స్ చేసిన వర్మ హీరోయిన్

Tejaswi Madivada: స్నేహితుడైతే ముద్దు సన్నివేశాల సమయంలో కంఫర్ట్ ఉంటుంది అంటున్న హీరోయిన్

Jyothi
Published on: 19 Aug 2022 10:38 AM IST
Tejaswi Madivada Shocking Comments About the Kissing Scenes
X

ముద్దు సన్నివేశాల గురించి ఈ షాకింగ్ కామెంట్స్ చేసిన వర్మ హీరోయిన్

Tejaswi Madivada: తెలుగు బ్యూటీ తేజస్వి మడివాడ "ఐస్ క్రీమ్" సినిమాలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక రెండుసార్లు బిగ్ బాస్ లో కూడా కనిపించి బాగానే ఫాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించింది. అయితే "ఐస్ క్రీమ్" సినిమాలో న్యూడ్ గా కూడా నటించి ఈ భామ బాగానే రచ్చ చేసింది.

ఇక బిగ్ బాస్ తర్వాత నుంచి తన పొట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు దుమారం లేపుతూ ఉంటుంది తేజస్విని. ఇక తాజాగా ఈమె చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వెండితెరపై ముద్దు సన్నివేశాల గురించి దిమ్మతిరిగే జవాబులు ఇచ్చింది తేజస్వి.

తాజాగా బాగా తెలిసిన స్నేహితుడైతే తెరపై ముద్దు సన్నివేశాలలో నటించడానికి సులువుగా ఉంటుంది అని చెప్పకొచ్చింది ఈ భామ. ప్రస్తుతం "కమిట్మెంట్" అని సినిమాలో నటిస్తున్న ఈ భామ హీరో శ్రీనాథ్ తో స్క్రీన్ పై బాగానే కెమిస్ట్రీ పండించింది. అంతేకాకుండా రొమాంటిక్ సన్నివేశాలు బెడ్రూమ్ సన్నివేశాలలో కూడా నటించి షాక్ ఇచ్చింది. ఇక అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఫ్రెండ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని అందుకే తన స్నేహితుడైన శ్రీనాధ్ ని ఆ పాత్ర కోసం రిఫర్ చేశానని స్పష్టం చేసింది. మరి అతడు నిజంగానే స్నేహితుడా లేక ఈమె ప్రేమికుడా అంటూ కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story