Zombie Reddy: మరోసారి బుల్లితెరపై అదరగొట్టిన తేజ సజ్జ..!

Zombie Reddy: తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం జాంబీ రెడ్డి.

Samba Siva Rao
Published on: 8 April 2021 6:11 PM IST
Teja sajja Zombie Reddy Movie
X

తేజ సజ్జ ఫైల్ ఫోటో 

Zombie Reddy: తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం జాంబీ రెడ్డి. తేజ బాలనటుడిగా ఇంద్ర, సాంబ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే విడుదలైన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కరోనా కారణంగా థియేటర్లకు జనాలు పెద్దగా వెళ్లలేదు. సినిమా భారీ లాభాలు రాకపోయిన నిర్మాతను మాత్రం గట్టెక్కించిందనే చెప్పాలి. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతకు కాసుల పంట పండించిందని టాక్. అయితే ఈ సినిమా ప్రముఖ శాటిలైట్ చానల్ స్టార్ మాటీవిలో మార్చి 28న ప్రసారం అయింది. ఈ సినిమాను ప్రసారం చేస్తే 9.66 టీఆర్పీ వచ్చింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ టీఆర్పీ వచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్.

తెలుగులో తొలిసారి జాంబీ జోనర్ సినిమా చేయడమే ఓ సాహసం. తేజ సజ్జ జాంబీ రెడ్డితో వచ్చినప్పటికీ ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై పూర్తిస్థాయి హీరోగా ప్రజెంట్ చేయలేకపోయింది. జాంబీ రెడ్డి తెలుగు సినిమాకు ఎక్కువ.. జాంబీ జానర్ కు తక్కువగా మారింది. సినిమా సంగతి ఎలా ఉన్నా.. బుల్లితెరపై ప్రసారమైన ఈ సినిమాను వీక్షకులు బ్రహ్మరంథంపట్టారు. దీంతో తేజను బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసినట్టు కనిపిస్తోంది. బుల్లితెర ప్రసారం కావడంతో ఈ సినిమాకు 9.66 టీఆర్పీ రావడం పెద్ద సంచలనమే. ఓ కొత్త హీరోకు ఈ రేంజ్ రేటింగ్ అంటే పెద్ద విశేషమే. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాకు టీవీలోమంచి రేటింగ్ వచ్చింది. దీంతో ఈ హీరో బుల్లితెరపై మంచి డిమాండ్ ఏర్పడింది.

వైవిధ్యభరితమైన కథలను తనదైన మార్క్‌లో ప్రజెంట్ చేసే ప్రశాంత్ వర్మ..ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలి తెలుగు జాంబీ మూవీ ప్రేక్షకుల ముందకు వచ్చింది 'జాంబి రెడ్డి'. యంగ్ హీరో తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ హీరో హీరోయిన్లుగా నటించగా.. పృథ్వీరాజ్, గెటప్ శీను, హేమంత్, హర్షవర్ధన్, అదుర్స్ రఘు, అన్నపూర్ణమ్మ కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా మార్చి 26 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story