Ishq Trailer: 'ఇష్క్' ఇది లవ్ స్టోరీ కాదు.. ట్రైలర్ రిలీజ్

Ishq Trailer: తేజ సజ్జ బాలనటుడిగా ఇంద్ర, సాంబ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Samba Siva Rao
Updated on: 15 April 2021 12:14 PM IST
Teja Sajja Ishq (Not a Love Story) Movie Trailer Released | Teja Ishq Trailer
X

Teja Ishq Trailer

Ishq Trailer: తేజ సజ్జ బాలనటుడిగా ఇంద్ర, సాంబ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే విడుదలైన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ టాక్ తెచ్చుకున్నాడు. సినిమా భారీ లాభాలు రాకపోయిన నిర్మాతను మాత్రం గట్టెక్కించిందనే చెప్పాలి. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతకు కాసుల పంట పండించిందని టాక్. దీంతో తేజ మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దాంతో నిర్మాతలు తేజ సజ్జతో సినిమాలు చేయడానికి వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో తేజ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

తేజ సజ్జ నటించిన రీసెంట్ మూవీ 'ఇష్క్' (నాట్ ఏ లవ్ స్టోరీ) అన్నది ట్యాగ్ లైన్. సూపర్ గుడ్ ఫిలింస్ చాలా కాలం తర్వాత మళ్లీ సినిమా నిర్మాణం మొదలు పెట్టింది. తేజ సజ్జ-ప్రియా వారియర్ కాంబినేషన్‌లో 'ఇష్క్' అనే సినిమాను తెరకెక్కుతుంది. ఇక గురువారం(ఏప్రిల్ 15) ఈ సినిమా ట్రయిలర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ట్యాగ్ లైన్ కు తగినట్లే వుంది ట్రైలర్. కోవిడ్ కారణంగా సినిమాలు అన్నీ వాయిదాపడిన నేపథ్యంలో ఇష్క్ రావడం విశేషమే. అయితే ఈ సినిమా తేజ ఖతాలో మరో హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. సూపర్ గుడ్ ఫిలింస్ చిత్రాల్లో తేజ సజ్జ నటించడం కొత్తేమి కాదు. బాల నటుడిగా ఉన్నప్పుడు పలు చిత్రలు ఈ బ్యానర్ లో చేశాడు.

'ఇష్క్' ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ మూవీ ట్రైలర్ సుప్రీమ్ హీరో సాయి తేజ్ రిలీజ్ చేశారు. లవ్ స్టోరీ కన్నా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించాయి. లవర్స్ జంట సరదాగా రైడ్‌కు వెళ్లడం, అక్కడ అనుకోని సంఘటనలు వారి ఎదురతాయి. లైన్ వినడానికి ఓల్డ్ అనిపిస్తోంది కానీ ట్రైలర్‌లో సీన్లు అన్నీ కాస్త కొత్తగానే వున్నాయి. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ పతాకంపై ప్రసాద్, పరాస్ జైన్, అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించగా.. స్వరసాగర్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించాడు. ఏప్రిల్ 23న సినిమా విడుదల చేయనున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story